ఆ చిన్న వారిలో నేనుండి యున్న

Telugu Christian Song

ఆ చిన్న వారిలో నేనుండి యున్న నహాహా మా యేసును నేఁ జూచి యుందు ||నా చిన్న|| 1. ప్రభు యేసు ప్రపంచమం దుండినపుడు పసి బాలకులఁ బిల్చి ప్రార్థించె ననెడు ప్రాచీన కథను నేఁ జదువుచున్నప్పుడు వారిలో నే నున్న నెంతో బాగుండు ||నా చిన్న|| 2. ఆ కరుణ కరము నా తలపైని వ్రాలి యాకాశ బాహువు నా చుట్టు నిలిచి య నేక బాలకుల రానిమ్మను జాలి తోఁ గర్త పిలుపు విన నాకెంతో మేల్మి ||యా చిన్న|| 3. ఇ కమీఁదఁ బ్రార్థన ద్వారా దర్శింతున్ బ్రకటిత ప్రభు ప్రేమ పంచి యియ్యమందు న మ్మకముతో యేసుని వెదకుచు నుందు సుఖ లోకమందునఁ జూచి వినుచుందు ||నా చిన్న|| 4. శుద్ధుల కొఱకు రాజ్యము నేలన్ సిద్ధము చేయఁ బ్రభు యేసు వెళ్లెన్ ముద్దు పాపలు వత్తు రందున
Telugu