ఆ దరి చేరే దారే కనరాదు

Telugu Christian Song

ఆ దరి చేరే దారే కనరాదు సందె వెలుగు కనుమరుగై పోయే నా జీవితాన చీకటులై మ్రోగే (2) ఆ దరి చేరే హైలెస్సో హైలో హైలెస్సా (2) విద్య లేని పామరులను పిలిచాడు దివ్యమైన బోధలెన్నో చేసాడు (2) మానవులను పట్టే జాలరులుగా చేసి ఈ భువిలో మీరే నాకు సాక్షులన్నాడు (2) ||ఆ దరి|| సుడి గాలులేమో వీచెను అలలేమో పైపైకి లేచెను (2) ఆశలన్ని అడుగంటిపోయెను నా జీవితమే బేజారైపోయెను (2) ||ఆ దరి|| వస్తానన్నాడు ఎప్పుడూ మాట తప్పడు ఎంత గండమైనా అండ ప్రభువు ఉన్నాడు (2) దరి చేర్చే నాథుడు నీ చెంతనుండగా ఎందుకు నీ హృదయాన ఇంత తొందర (2) ||ఆ దరి|| --Aa daari chere daare kanaraadu--
Telugu