ఆఆఆ... పాటలు పాడుదము

Telugu Christian Song

ఆఆఆ... పాటలు పాడుదము ఆఆఆ... నాట్యము చేయుదము (2) ప్రజలందరికి ప్రభువుద్భవించెను పండుగ చేయుదము (2) ..ఆఆఆ.. 1. కాలము సంపూర్ణమాయెను - లేఖనములు నెరవేరెను (2) కన్య మరియ గర్భమున - క్రీస్తు యేసు జన్మించెను (2) ..ఆఆఆ.. 2. సర్వోన్నతుని కుమారుడు - సమాధానమున కధిపతియు (2) సర్వజనుల రక్షకుడు సతతం స్తోత్రార్హుడు (2) ...ఆఆఆఆ... --Aa..Aa..Aa paatalu paadudhumu--
Telugu