ఆధారం నాకు ఆధారం

Telugu Christian Song

ఆధారం నాకు ఆధారం - నాకు తోడు నీడైయున్న నీ కృపయే ఆధారం - ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు నాకు - నీ నామం ఆశ్రయము తల్లి తండ్రి లేకున్నా -బంధుజనము రాకున్నా లోకమంత ఒక్కటైన - బాధలన్ని బంధువులైన 1.బలహీన బంధంలో నేనుండగా శ్రమల సంద్రంలో పడియుండగా ఇరుకులో విశాలతను - కలిగించిన ఓ దేవా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా 2.దారిద్య్రపు సుడి నుండి - ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై - నడిపించిన యేసయ్యా విడువను ఎడబాయనని - పలికిన దేవా 3.దిగులుపడిన వేళలలో దరిచేరిన దేవా అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా --Aadharam naaku aadharam - naaku thodu needai unna--
Telugu