ఆకాశ పక్షులను చూడండి

Telugu Christian Song

ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు అవి గరిసెలలో దాచుకోవు.. వూ.. వూ.. ||ఆకాశ|| అనుదినము కావలసిన ఆహారము అందజేయును వాటికి ఆ దేవుడు కలసికట్టుగా అవి ఎగిరి పోతాయి కడుపు నింపుకొనిపోయి మరల తిరిగి వస్తాయి ||ఆకాశ|| స్వార్ధము వంచన వాటికుండదు సాటివాని దోచుకొనే మనసు ఉండదు రేపటిని గూర్చిన చింత ఉండదు పూట ఎలా గడపాలని బాధ ఉండదు ||ఆకాశ|| పక్షులను పోషించే ఆ దేవుడు మనుష్యులను పోషించుట మానివేయునా సృష్టిలోన మనిషి బ్రతుకు శ్రేష్టము కదా ప్రభువు తోడు ఉండగా మనకు ఎందుకు బాధ ||ఆకాశ|| --Aakasa pakshulanu choodandi - avi vitthavu koyavu--
Telugu