ఆకాశం అమృత జల్లులు

Telugu Christian Song

ఆకాశం అమృత జల్లులు కురిపించింది ఈ లోకం ఆనందమయమై మురిసింది (2) అంతు లేని ఈ అనంత జగతిలో శాంతి కొరవడి మసలుచుండగా (2) రక్షణకై నిరీక్షణతో (2) వీక్షించే ఈ అవనిలో (2) శాంతి సమతల కధిపతి నేడు జన్మించినాడనీ ||ఆకాశం|| పొంతన లేని వింత జగతిలో పాపాంధకారం ప్రబలి యుండగా (2) సమ్మతిని మమతలను (2) పెంచుటకై ఈ పృథివిపై (2) ఆది దేవుడే ఆదరంబున ఉదయించినాడనీ ||ఆకాశం|| --Aakasam amrutha jallulu kuripinchindi--
Telugu