ఆకాశము వైపు నా కన్నులెత్తుచున్నాను

Telugu Christian Song

ఆకాశము వైపు నా కన్నులెత్తుచున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా.... ॥2॥ కలవరము నొందను నినునమ్మి యున్నాను కలత నేను చెందను కన్నీళ్లు విడువను 1. ఆకాశముపై నీ సింహాసనమున్నది రాజదండముతో నన్నేలుచున్నది నీతిమంతునిగా చేసి నిత్యజీవమనుగ్రహించితివి నేనేమైయున్నానో అది నీ కృపయే కదా ..... || ఆకాశము వైపు॥ 2. ఆకాశము నుండి నాతో మాట్లాడుచున్నావు ఆలోచన చేత నన్ను నడిపించుచున్నావు నీ మహిమతో నను నింపి నీ దరికి నన్ను చేర్చి (చేర్చితివి) నీవుండగ ఈ లోకములో ఏదియు నాకక్కరలేనే లేదయ్యా.... || ఆకాశము వైపు || 3. ఆకాశము నుండి అగ్ని దిగివచ్చియున్నది అక్షయ జ్వాలగ నాలో రగులుచున్నది నా హృదయము నీ మంద
Hosanna ministries
Telugu
20 views