ఆకసాన సుక్కఎలిసె – అర్ధరాత్రి

Telugu Christian Song

ఆకసాన సుక్కఎలిసె – అర్ధరాత్రి పొద్దుపొడిసె సీకటంత పారిపాయెరా //2// మా సిక్కులన్ని తీరిపాయెరా మా దిక్కుమొక్కు యేసుడాయెరా //2// సంబరాలు ఈయాల సంబరాలు క్రీస్తు జన్మ పండగంట సంబరాలు //3// 1. గొల్లలంత రాతిరేల కంటిమీద కునుకు లేక మందలను కాయుచుండగా -చలి మంటలను కాయుచుండగా //2// ఆ మంటకాడ ఎదోపెద్ద ఎలుగొచ్చే – ఆ ఎలుగులోన దేవ దూత కనిపించే //2// ఎమ౦టడేమోనని గుండె ధడపుట్టే….. ఏసు జన్మ వార్త తెలిపెర దూత చూసి రమ్మని చెప్పేర //2//అకసాన// 2. సల్ల గాలి వీసీంది సుక్కా దారి సూపింది జ్ఞానులంతా పాక చేరిరి – రారాజు దైవ సుతుని గాంచిరి //2// బంగారు బోల కానుకలు తెచ్చారు వారు మోకరించి ఏసు ప్రభుని మొక్కారూ //2//
Telugu