ఆనంద సంద్రంబున నా

Telugu Christian Song

ఆనంద సంద్రంబున నా జీవిత నావను నడిపేది ఆ యేసుడే దరిచేర్చు ఆ దేవుడే ||ఆనంద|| 1.పేనుగాలులే వీచినా తుఫానులే తరిమినా గద్దించి కాపాడు ప్రభు అండ నీ కుండ దిగులేల ఓ సోదరీ నిశ్చితగా సాగుమా ||ఆనంద|| 2.ఆప్తకాలమందునా రోదించి ప్రార్ధించినా ఆదరణ లేదని దూషింపబోకుమా ప్రభు చిత్తమనే గిన్నెనే సంతోషముగా త్రాగుము ||ఆనంద|| 3.ఏవైపు నీ మార్గము ఏవైపు నీ గమ్యము ప్రభు సన్నిధిని వీడి పయనింప చూచి మత్స్యంబు గర్భంబున నివసింపగోరెదవా ||ఆనంద|| --Aananda sandrambuna naa jeevitha naavanu--
Telugu