ఆనంద యాత్ర ఇది ఆత్మీయ

Telugu Christian Song

ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరుషలేము యాత్ర || 1. యేసుని రక్తము పాపముల నుండి విడిపించును వేయినోళ్ళతో స్తుతించినను తీర్చలేము ఆ రుణము ||ఆనంద|| 2. రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండ మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగ ||ఆనంద|| 3. కృతజ్ఞత లేనివారు వేలకొలదిగ కూలినను కృపా వాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృప పొందెదము ||ఆనంద|| 4. ఆనందం ఆనందం యేసుని చూచె క్షణం ఆసన్నం ఆత్మానంద భరితులమై ఆగమనాకాంక్షతో సాగెదన్ ||ఆనంద|| --Aananda yaatra idi aathmeeya yaatra--
Telugu