ఆనందింతును నీలో దేవ

Telugu Christian Song

ఆనందింతును నీలో దేవ - అనుదినం నిన్ను స్తుతించుచు మధురమైన నీ నామమునే మరువజాలక కొలిచెద ప్రభువా 1. ఆత్మనాదా - అదృశ్య దేవా - అఖిల చరాలకు ఆధారుండా అనయము నినుమది కొనియాడుచునే - ఆనందిన్తు నీ పాదసేవ 2. నాదు జనములు నను విడిచినాను - నన్ను నీవు విడువకుండ నీ కను దృష్టి నాపై నుంచి - నాకు రక్షణ శృంగమైన 3. శ్రేష్టమగు నీ దాసుల కొరకు - లోకమందు రానై యున్న ఆ ఘడియ ఎపుడో నీకే తెలుసు అంత వరకు భద్ర పరచు 4. శ్రమలు నన్ను చుట్టిన వెళ్ళ - చింతలో కృశించిన వేళ అభాయముగా నీ దర్శనమిచ్చి - శ్రమలు బాపి శాంతినిచ్చి --Aanandhinthunu neelo deva--
Telugu