ఆనందమే పరమానందమే

Telugu Christian Song

ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో (2) ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము (2) ||ఆనందమే|| 1. పచ్చిక గల చోట్ల పరుండ జేసితివే జీవ జలములు త్రాగనిచ్చితివే (2) నా ప్రాణమునకు సేదదీర్చితివి నీతియు శాంతియు నాకిచ్చితివే (2) ||ఆనందమే|| 2. గాఢాంధకారము లోయలలో నేను సంచరించినా దేనికి భయపడను (2) నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే (2) ||ఆనందమే|| 3. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేసావు (2) నీతో నేను నీ మందిరములో నివాసము చేసెద చిరకాలము (2) ||ఆనందమే|| --Aanandame paramaanandame aasraya puramaina yesayya--
Hosanna ministries
Telugu
1 views