ఆరాధ్యుడవు నీవే ప్రభు

Telugu Christian Song

ఆరాధ్యుడవు నీవే ప్రభు ఆనందముతో ఆరాధింతును (2) అత్యున్నత ప్రేమను కనుపరచినావు నిత్యము నిను కొనియాడి కీర్తింతును (2) ||ఆరాధ్యుడవు|| పేతురు వలె నేను ప్రభునకు దూరముగా పనులతో జనులతో జతబడి పరుగెత్తగా (2) ప్రయాసమే ప్రతిక్షణం ప్రతి నిమిషం పరాజయం గలిలయ తీరమున నన్ను గమనించితివా (2) ||ఆరాధ్యుడవు|| ప్రభురాకడ నెరిగి జలజీవరాసులు తీరము చేరిరి కర్తను తేరి చూడగా (2) పరుగెత్తెను పలు చేపలు ప్రభు పనికై సమకూడి సంతోషముతో ఒడ్డున గంతులేసెను (2) ||ఆరాధ్యుడవు|| నిన్నెరుగను అని పలికి అన్యునిగా జీవించితి మీనముతో భోజనము సమకూర్చితివా (2) ఆచేపల సమర్పణ నేర్చితి నిను వెంబడింతు అద్వితీయ దేవుడవు నీవే ప్రభు (2) ||ఆరాధ్యుడవు||
Telugu