ఆరాధించెదను నిన్ను

Telugu Christian Song

ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2) ఆనంద గానముతో ఆర్భాట నాదముతో (2) ||ఆరాధించెదను|| నీ జీవ వాక్యము నాలో జీవము కలిగించె (2) జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను (2) ||ఆరాధించెదను|| చింతలన్ని కలిగిననూ నిందలన్ని నన్ను చుట్టినా (2) సంతోషముగ నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును (2) ||ఆరాధించెదను|| --Aaradhinchedanu ninnu naa yesayya--
Telugu
1 views