ఆత్మా నడుపు స త్యము లోని

Telugu Christian Song

ఆత్మా నడుపు స త్యము లోని కిపుడే యాత్మా నడుపు ఆత్మా నీ సాయంబు నధికంబుగా నిచ్చి ఆత్మానందముతో దై వారాధనమున ||కాత్మా|| 1. ఘోర కలుషంబుల దూరంబుగాఁ దోలి పారమార్థిక బుద్ధిఁ గోరు నట్టులను ||ఆత్మా|| 2. అంధత్వంబు వలన మందమైయుండు మా డెందంబు లెల్ల నీ యందు వెలుఁగుటకు ||ఆత్మా|| 3. నిర్మల హృదయంబు నిరతంబు మా కిచ్చి కూర్మిన్ నీ వరములఁ గూర్చి దీవించి ||ఆత్మా|| 4. సకల మానవులతో అకలంక శుభవార్తఁ బ్రకటించు బలజ్ఞాన నిక రంబు నిచ్చి ||ఆత్మా|| 5. దీవించి పంపు మో దైవాత్మా మమ్మును భావజ్ఞాన మొసంగి ప్రభు సేవలోన ||ఆత్మా|| --Aathmaa nadupu sathyamu loni--
Telugu