ఆయన గాయములచే నేను స్వస్థత నొందితిని

Telugu Christian Song

ఆయన గాయములచే నేను స్వస్థత నొందితిని ఆయన కొరడా దెబ్బలచే నాకు స్వస్థత కలిగెను (2) ఆయన నా పాపములను భరించెను ఆయన నా వ్యాధులను మోసెను (2) హల్లెలూయా హల్లెలూయా యేసయ్య నీకు కృతజ్ఞతలు హల్లెలూయా హల్లెలూయా నా రక్షకుడా నీకు స్తుతులు (2) ||ఆయన గాయములచే|| ఆయన మనలను చూచి జాలిపడెను మన కష్టములు భరించెను (2) మన శిక్ష ఆయన మీద పడెను మన శాంతి నిమిత్తము (2) ||ఆయన గాయములచే|| అందరము గొఱ్ఱెలవలె తప్పిపోయితిము ప్రతివాడు తన త్రోవను వెంబడించెను (2) యెహోవా మన అందరి దోషములను ఆయనమీద మోపెను (2) ||ఆయన గాయములచే|| --Aayana gaayamulache nenu swasthatha nondhithini--
Traditional
Telugu