ఆయన గొప్పవాడు మహోన్నతుడు
స్తుతింపదగినవాడు మహిమాన్వితుడు (2)
ఆయన మహత్తరుడు
ఆయన అద్భుతుడు (2)
హోసన్నా హోసన్నా
ఉన్నత స్థలములలో దేవునికి మహిమ
హోసన్నా హోసన్నా
భూమిమీద శాంతి మనుష్యులలో ప్రీతి (2) ||ఆయన గొప్ప||
ఆయన కార్యములు గొప్పవి
ఆయన అద్భుతములు ఆశ్చర్యములు (2)
ఆయన బలము అనంతము
ఆయన జ్ఞానము అపారము (2) ||ఆయన గొప్ప||
ఆయన ప్రేమ విస్తారము
ఆయన కృప బాహుల్యము (2)
ఆయన దయ అనుగ్రహము
ఆయన వాత్సల్యము అమితము (2) ||ఆయన గొప్ప||
ఆయన రాజ్యము నిత్యము
ఆయన ఆధిపత్యము శాశ్వతము (2)
ఆయన సింహాసనము స్థిరము
ఆయన పరిపాలన నీతియుతము (2) ||ఆయన గొప్ప||
--Aayana goppavaadu mahonnathudu--