ఆయన నా కొండ నా దుర్గము నా రక్షకుడు

Telugu Christian Song

ఆయన నా కొండ నా దుర్గము నా రక్షకుడు నా ఆశ్రయము నా కేడెము నా డాలు (2) నేను ఆయనను నమ్ముకొంటిని ఆయన నా శత్రువుల నుండి నన్ను రక్షించును (2) స్తుతింపదగిన ప్రభువును నేను వేడుకొంటిని నా శత్రువుల నుండి రక్షింపబడుదును (2) మరణపు తాళ్ళు నన్ను చుట్టినవి నాశన ప్రవాహములు నన్ను భయపెట్టెను (2) ||ఆయన నా|| నా బాధలో యెహోవాను వేడుకొంటిని నా దేవునకు మొఱ్ఱపెట్టుకొంటిని (2) ఆయన తన మందిరములో నా స్వరము విన్నాడు నా మొఱ్ఱ ఆయన చెవులకు చేరెను (2) ||ఆయన నా|| ఆయన ఆకాశమును వంచి దిగివచ్చెను ఆయన పాదముల క్రింద గాఢాంధకారము (2) ఆయన నన్ను రక్షించెను ఆయన నాయెడ ప్రేమ ఉన్నందున (2) ||ఆయన నా|| --Aayana naa konda
Traditional
Telugu