ఆయన నాకై రాబోవుచున్నాడు మేఘములపై

Telugu Christian Song

ఆయన నాకై రాబోవుచున్నాడు మేఘములపై నా యేసయ్యా వచ్చుచున్నాడు నన్ను చేర్చుకొనుటకు (2) ఆయన రాకడకు సిద్ధముగా ఉండెదను నా దీపము వెలిగించి నిలబడియుందెదను (2) మరనాథా మరనాథా ప్రభువా త్వరగా రమ్ము మరనాథా మరనాథా యేసయ్యా నేను నీ కోసము ఎదురు చూచుచున్నాను (2) ||ఆయన నాకై|| తుత్తూరి మోగును ప్రధానదూత పిలుపుండును (2) క్రీస్తులో మృతులు మొదట లేతురు తరువాత మనము ఆయనను కలుసుకొందుము (2) ||ఆయన నాకై|| వధువు వరుని కోసము ఎదురు చూచుచున్నది శుద్ధ వస్త్రములు ధరించి అలంకరించుకొని (2) పెండ్లి విందుకు సిద్ధముగా దేవునికి మహిమ కలుగునుగాక (2) ||ఆయన నాకై|| --Aayana naakai raabovuchunnadu meghamulapai--
Traditional
Telugu