ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు
ఆయన న్యాయముచేయువాడు సత్యవంతుడు (2)
ఆయన మార్గములు యథార్థములు
ఆయన తీర్పులు నీతియుతములు (2)
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు
సర్వశక్తిమంతుడైన ప్రభువు దేవుడు (2)
ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు
ఆయన సత్యవంతుడు విశ్వాసయోగ్యుడు (2) ||ఆయన నీతిమంతుడు||
ఆయన కార్యములు గొప్పవి
ఆయన మార్గములు నీతియుతములు (2)
రాజులకు రాజు శతాబ్దాలకు ప్రభువు
నీవు మాత్రమే పరిశుద్ధుడవు (2) ||ఆయన నీతిమంతుడు||
సమస్త రాజ్యములు వచ్చి
నీ యెదుట నమస్కరించును (2)
నీ న్యాయములు వెల్లడియైనవి
సమస్త జనములు నిన్ను ఆరాధించును (2) ||ఆయన నీతిమంతుడు||
--Aayana neethimanthudu parishuddudu--