ఆయన నన్ను ప్రేమించెను సిలువపై మరణించెను
నా పాపములను భరించెను నన్ను రక్షించెను (2)
ఆయన ప్రేమ వర్ణనాతీతము
ఆయన త్యాగము అపారము (2)
హల్లెలూయా హల్లెలూయా
యేసయ్య నీకు స్తుతి
హల్లెలూయా హల్లెలూయా
రక్షకుడా నీకు మహిమ (2) ||ఆయన నన్ను||
నా స్థానమున ఆయన మరణించెను
నా శిక్ష ఆయన భరించెను (2)
ఆయన గాయములచే నేను స్వస్థత నొందితిని
ఆయన రక్తము నన్ను పరిశుద్ధుని చేసెను (2) ||ఆయన నన్ను||
మూడవ దినమున ఆయన లేచెను
మరణమును జయించెను (2)
పునరుత్థానుడై దర్శనమిచ్చెను
నాకు నూతన జీవము దయచేసెను (2) ||ఆయన నన్ను||
స్వర్గమునకు ఆరోహణించి
తండ్రి కుడిపార్శ్వమున కూర్చొనెను (2)
నా కొరకు మధ్యవర్తియై
నిత్యము విజ్ఞాపన చ