ఆయన విశ్వాసయోగ్యుడు సత్యవంతుడు
ఆయన వాక్యములు నిజములు నిత్యములు (2)
ఆయన వాగ్దానములు
నిలుచుండును నెరవేరును (2)
హల్లెలూయా హల్లెలూయా
యెహోవా విశ్వాసయోగ్యుడు
హల్లెలూయా హల్లెలూయా
ఆయన సత్యవంతుడు (2) ||ఆయన విశ్వాస||
ఆయన చెప్పినది జరుగును
ఆయన వాగ్దానమిచ్చినది నెరవేరును (2)
ఆయన మాట మారదు
ఆయన నిబంధన ఎన్నటికి విఫలము కాదు (2) ||ఆయన విశ్వాస||
తరము తరమునకు
ఆయన విశ్వాసయోగ్యత కనబడును (2)
ఆయన స్థాపించిన భూమి
నిలిచియుండును నిత్యము (2) ||ఆయన విశ్వాస||
ఆయన ప్రేమ నిత్యము
ఆయన కృప శాశ్వతము (2)
ఆయన దయ తరము తరమునకు
ఆయనయందు భయపడువారిపై ఉండును (2) ||ఆయన విశ్వాస||
--Aayana viswasa yogyudu sat