అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే

Telugu Christian Song

అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము - వరుణి వలే పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది (2) అల్ఫా ఒమేగ యైన నా ప్రాణ ప్రియునికి నిలువెళ్ల నివేదించి మైమరతునే (2) నా యేసు రాజుతో లయము కాని రాజ్యములో ప్రవేశింతునే ... పరిపూర్ణమైన పరిశుద్ధులతో (2) " అదిగదిగో " కల్యాణ రాగాలు ఆత్మీయ క్షేమాలు తలపోయుచూ నే పరవసింతునే (2) రాజాధిరాజు తో స్వప్నాల సౌధములో విహరింతునే... నిర్మలమైన వస్త్రధారినై (2) " అదిగదిగో " జయించిన వాడై సర్వాధి కారియై సింహాసనా సీనుడై నను చేర్చుకొనును (2) సీయోను రాజుతో రాత్రిలేని రాజ్యములో ఆరాధింతునే ... వేవేల దూతల పరివారముతో (2) " అదిగదిగో "
Hosanna ministries
Telugu
1 views