అదిగో వచ్చునదెవరో చూడుమా

Telugu Christian Song

అదిగో వచ్చునదెవరో చూడుమా - మహిమ గలిగిన మన యేసే నీ కన్నులెత్తి చూడుమా - క్రీస్తు ప్రభావముతో వచ్చుచుండెన్ 1. మేఘారూఢుడై అచ్చుచున్నాడు - కంపించెను ఆకాశమెల్ల వీణె వాయింప దూతల్ పాడంగ - పెండ్లి కుమారుండై వచ్చుచుండెన్ 2. సూర్యచంద్రులు అదృశ్యులైరి - మౄతులెవ్వరులేరు అచ్చట అందరు భయపడి వణకుచున్నారు - తీర్పుచేయ క్రీస్తు వచ్చుచుండెన్ 3. గతించును మనమున్న లోకము - నూతన లోక మొకటి కలుగును నూతన మగును జగమంతయును - క్రీస్తు రాజ్యమేల వచ్చుచుండెన్ 4. ముండ్ల మకుటము నింకలేదు - మహిమ కిరీటము ధరించెను అలంకారముతో అందమైయున్న - పెండ్లి కుమార్తెకై వచ్చుచుండెన్ --Adigo vachunadevaro chooduma - Mahima galigina mana yesu-
Telugu