అడవి చెట్ల నడుమ

Telugu Christian Song

అడవి చెట్ల నడుమ – ఒక జల్దరు వృక్షం వలె పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు (2) కీర్తింతున్ నా ప్రభుని జీవ కాలమెల్ల ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను (2) షారోను రోజాయనే – లోయ పద్మమును ఆయనే అతిపరిశుద్ధుడు ఆయనే పదివేలలో అతిశ్రేష్టుడు (2) ||కీర్తింతున్|| మనోవేదన సహించలేక – సిలువ వైపు నే చూడగా లేవనెత్తి నన్నెత్తుకొని భయపడకుమని అంటివి (2) ||కీర్తింతున్|| ఘనమైన నా ప్రభువా – నీ రక్త ప్రభావమున నా హృదయము కడిగితివి నీకే నా స్తుతి ఘనత(2) ||కీర్తింతున్|| --Adavi chetla naduma--
Telugu