అడవి పుష్పమా సంతోషించుమా

Telugu Christian Song

అడవి పుష్పమా సంతోషించుమా – కస్తురీ పుష్పమా ఉల్లసించుమా ఎండిన భూమి అరణ్యమా – సంగీతములు పాడుమా (2) || అడవి పుష్పమా || 1. లెబనోను సౌందర్యమూ – నీకు కలుగునుగా షారోను పరిమళమూ – నీకు ఉండునుగా కర్మెలు సొగసు దేవుని తేజస్సు నీకు ఇచ్చునుగా (2) || అడవి పుష్పమా || 2. సడలిన చేతులను – బలపరచిన దేవుడు తొట్రిల్లు మోకాళ్ళను – ద్రుడపరచిన నాథుడు భయము నొందకు నీ దేవుడు శక్తివంతుడు (2) || అడవి పుష్పమా || --Adavi pushpama santhoshinchuma - kasthuri pushpama ullasinchuma--
Telugu