అగ్ని మండించు నాలో అగ్ని

Telugu Christian Song

అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా-నాలో అగ్ని మండించు (2) 1.అగ్ని మండుచుండెనే - పొద కాలిపోలేదుగా ఆ అగ్నిలోనుండే-నీవు మోషేను దర్శించినావే ||అగ్ని|| 2.అగ్ని కాల్చివేసెనే-సిద్ధంచేసిన అర్పణను ఆ అగ్ని ద్వారానే-నీవు గిద్యోన్ని ధైర్యపరచితివే ||అగ్ని|| 3.అగ్ని కాన రానందునా-వారు సిగ్గుపడి పోయిరే నీ అగ్ని దిగిరాగా-నీవు ఏలియాను ఘనపరచినావే ||అగ్ని|| 4.ప్రాణ ఆత్మ శరీరము-నీకే అర్పించుచున్నానయ్యా నీ ఆత్మ వరములతో- నన్ను అలంకరించు మయ్యా ||అగ్ని|| --Agni mandinchu naalo agni mandinchu--
Telugu
1 views