అమూల్యమైన ఆణిముత్యమా
యెహోవ దేవుని హస్తకృతమా (2)
అపురూప సౌందర్య రాశివి నీవు
ఆత్మీయ సుగుణశీలివి నీవు (2) |అమూల్యమైన|
జ్ఞానము కలిగి నోరు తెరచుదువు
కృపగల ఉపదేశమును చేయుదువు (2)
ఇంటివారిని బాగుగ నడుపుచూ
వారి మన్ననలను పొందుచుందువు (2) |అమూల్యమైన|
చేతులతో బలముగా పనిచేయుదువు
బలమును ఘనతను ధరించుకొందువు (2)
రాత్రివేళ నీ దీపము ఆరదు
కాంతికిరణమై మాదిరి చూపుదువు (2) |అమూల్యమైన|
దీనులకు నీ చేతులు పంచును
దరిద్రులను నీవు ఆదుకొందువు (2)
దూరము నుండి ఆహారము కొనుచు
మంచి భోజనముతో తృప్తిపరచుదువు (2) |అమూల్యమైన|
--Amulyamaina aanimuthyama--