అందాల ఉద్యానవనమా

Telugu Christian Song

అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంఘమా (2) పుష్పించలేక ఫలియింపలేక (2) మోడి మిగిలావ నీవు (2) ||అందాల|| ప్రభు ప్రేమలో బాగు చేసి శ్రేష్టము ద్రాక్షగా నాటాడుగా (2) కాచావు నీవు కారు ద్రాక్షలు (2) యోచించు ఇది న్యాయమేనా (2) ||అందాల|| ప్రభు యేసులో నీవు నిలిచి పరిశుద్దాత్మతో నీవు పయనించుమా (2) పెరిగావు నీవు ఫలియింపలేక (2) యోచించు ఇది న్యాయమేనా (2) ||అందాల|| ఆకలిగొని నీవైపు చూడ ఆశ నిరాశాయే ప్రభు యేసుకు (2) ఇకనైనా నీవు నిజమైన ఫలముల్ (2) ప్రభు కొరకై ఫలియింపలేవా (2) ||అందాల|| --Andhaala udyana vanamaa - Oo kraisthava sanghama--
Telugu