అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నఁదరంబయో కన్న
తండ్రి వన్నె కెక్కిన మోక్ష వాసాళి సన్నుతు లున్నతమై యుండ మున్నె నీకు ||నన్ని||
1. నిన్నుఁ బ్రకటన సేయ నిఖిల లోకములను బన్నుగఁ జేసిన బలుఁడ
వీవె ఉన్న లోకంబుల -నుడుగక కరుణా సం-పన్నతతో నేలు
ప్రభుఁడ వీవె అన్ని జీవుల నెఱిఁగి యాహార మిచ్చుచు నున్న సర్వజ్ఞుం
డవు నీవే ఎన్న శక్యముగాక ఉన్న లక్షణముల సన్నుతించుటకు
నేఁ జాలుదునా ||యన్ని||
2. పుట్టింప నీవంచుఁ బోషింప నీవంచుఁ గిట్టింప నీవంచు గీర్తింతును
నట్టి పనికి మాలి నట్టి మానవుల చే పట్టి రక్షింపం బాధ్యుండ వంచు
దట్టమైన కృపను దరిఁజేర్చ నాకిచ్చి పట్టయి నిలచియుండు ప్రభుఁడ
వంచుఁ గట్టడచేఁ గడ ముట్టుదనుక నా పట్టుకొలఁది