అనంతుడా ఆదరించే యేసయ్య

Telugu Christian Song

అనంతుడా ఆదరించే యేసయ్య ఆకాశమందు నీవు తప్ప నాకు ఇంకెవరూ వున్నారాయ అనురాగ నిలయుడా ఐశ్వర్యవంతుడా కనికర పూర్ణుడా నా యేసయ్య కష్టాల కొలిమిలో నీకిష్టమైన రూపు చేసి నీ చేతి స్పర్శ తో ప్రతి క్షణము నన్ను ఆదరించి మహిమ స్వరూపుడా నా చేయి విడువక అనురాగము నాపై చూపించుచున్నావు శత్రువు పై సమరములో రథ సారథివై నడిపినావు నీ నియమాలను నేర్పించి శత్రువును ఓడించినావు విజయ సమరయోధుడా నాకు జయము నిచ్చి విజయోత్సవాలతో ఊరేగించుచున్నావు విడువక నన్ను ప్రేమించే నిజ స్నేహితుడై నిలిచినావు నీ హస్త బలముతో అగాధాలు దాటించినావు నీ సన్నిధి కాంతిలో నన్ను తేజరిల్ల చేసి ఆనంద నగరికై సిద్ధపరచు చున్నావు --Ananthuda aadarinche yesayya--
Telugu