అనుకరించెద నే ననుదినమును

Telugu Christian Song

అనుకరించెద నే ననుదినమును బాలుఁ డేసు ననువుగాను జ్ఞానమునం దును వయస్సునందును దే వుని ప్రేమను మానవుల ద యను బెరిగిన బాలుఁడేసు ||ననుకరించెద|| 1. పరదేశంబున వసించి పరమాత్తుని మదిఁ దలంచి దురితమును జయించిన స చ్చరితుఁడైన యోసేపు ||ననుకరించెద|| 2. తల్లి యానతి నెరవేర్చి తమ్ముని కష్టములఁ దీర్చి యెల్లకాలముండు కీర్తి నిల గడించిన మిర్యాము ||ననుకరించెద|| 3. పాలు మరచినది మొదలు ప్రభు సేవా సంపదలు ఆలయమునఁ బూసిన సు బాలకుండు సమూయేలు ||ననుకరించెద|| 4. శత్రువులను బరిమార్చి మిత్రులకు జయంబొనర్చి స్తోత్రగీతములు రచించిన సుందరుండౌ దావీదు ||ననుకరించెద|| 5. పరులకు న్యాయంబుఁ దీర్పఁ బ్రజలకు క్షేమంబుఁ గూర్పఁ పరమ వివేకంబుఁ గో
Telugu