అనురాగాలు కురిపించే నీ ప్రేమ

Telugu Christian Song

అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానలే సప్త స్వరాలుగా నే పాడనా యేసయ్య నా హృదయ సీమను ఏలుమయ నీ దివ్య సన్నిది చాలునయ నీ జ్ఞాన ఆత్మయే వికసింపచేసెను నన్ను సర్వ సత్యములలో నే నడచుటకు మరపురాని మనుజాశాలను విడిచి మనసార కొనియాడి జీవించెద ఇక నీ కోసమే అపురూప దర్శనమే బలపరుచుచున్నది నన్ను వెనుదిరిగి చూడక పోరాడుటకు ఆశ్చర్యకరమైన నీ కృప పొంది కడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే నీ నీతి నియమములే నడిపించుచున్నది నన్ను స్వర్ణ కాంతిమయమైన నగరము కొరకు అమూల్యమైన విశ్వాసము పొంది అనుక్షణము నిన్ను తలచి హర్షించేనే నాలో నా ప్రాణమే --Anuraagalu kuripinche nee prema thalachi--
Telugu