అపరాధిని యేసయ్య - కృపజూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ క్రపలో - నపరాధములను క్షమించు ||అపరాధిని||
1. సిలువకు నినునే గొట్టితీ - తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని - దోషుండ నేను ప్రభువా |అపరాధిని..
2. ప్రక్కలో బల్లెపుపోటు - గ్రక్కున పొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితి వయ్యో |అపరాధిని..
3. ముళ్ళతో కిరీటంబు - నల్లి నీ శిరమున నిడితి
నావల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రీ |అపరాధిని..
4. దాహంబు గొనగా చేదు - చిరకను ద్రావినిడితి
ద్రోహుండనై జేసితినీ - దేహంబు గాయంబులను |అపరాధిని..
5. ఘోరంబుగా దూరితిని - నేరంబులను జేసితిని
క్క్రూరుండనై గొట్టితిని - ఘోరంపి పాపిని దేవా |అ