అత్యంత సుందరుండును

Telugu Christian Song

అత్యంత సుందరుండును ఎల్లరి కాంక్షణీయుడు దేవాది దేవుడైన మా కల్వరి యేసు నాథుడు పల్లవి: కల్వరి నాథుడా - నన్ను జయించితి రక్షింప మృతుడైన - కల్వరి యేసు నాథుడా 2. గాయపడి శ్రమలతో పాపదుఃఖము మోసితివి సిల్వలో మరణించితివి దుఃఖ కల్వరి నాథుడా 3. శాంతి జీవము నీయను ఖైదీల విమోచనమునకై రక్తపు ఊట తెరచితివి ప్రేమ కల్వరి నాథుడా 4. తెచ్చిన ఈవులెల్లను మేలుకొరకు మనకిచ్చి ప్రేమనదిని పోసెను దయాకల్వరి నాథుడా 5. మహిమ పూర్ణుడగు నిన్ను కండ్లార చూతుమనుటయే ఇచ్చట మా ఆదరణ సాటిలేని కల్వరి ప్రభూ 6. స్పటిక సముద్ర తీరమున నీ ప్రేమయందు మున్గుచు నీ వలె నుందు నిత్యము మహిమ కల్వరి నాథుడా --Athyantha sundarundunu yellari kaankshan
Telugu