అతిపరిశుద్ధుడా స్తుతి నైవేద్యము

Telugu Christian Song

అతిపరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును (2) నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీ కోసమే – ఆశ్రయమైన నా యేసయ్యా ||అతిపరిశుద్ధుడా|| సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే (2) ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం (2) నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి (2) ||అతిపరిశుద్ధుడా|| సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే (2) కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా (2) నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా (2) ||అతిపరిశుద్ధుడా|| సారెపైన
Telugu