అతి సుందరుడవు యేసయ్యా

Telugu Christian Song

అతి సుందరుడవు యేసయ్యా మనోహరుడవు నీవయ్యా యధార్థవంతుల సభలో పరిశుద్ధులతో కలసి నిను ఆరాధించెదను హల్లేలుయా హల్లేలుయా హోసన్నా ఆరాధన నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు కృపాక్షేమములు నీ మందిరములో సమృద్ధిగా కలవు నే దీనుడనై నీ సన్నిధిని అనుభవించెదను పరవసించి పరవళ్ళుతొక్కి ఆరాదించెదను అమూల్యములైన వాగ్దానములు అనుగ్రహించావు అత్యధికముగా ఆశీర్వదించి హెచ్చించియున్నావు విశ్వాసముతో ఓర్పు కలిగి వాగ్దానమునే పొందెదను సంపూర్ణతకై పరిశుద్ధుడనై ఆరాధించెదను మహారాజువై సీయోనులో ఏలుచున్నావు పుణాదులుగల పట్టణమును కట్టుచున్నావు సౌందర్యముగల సీయోనులో ప్రకాశించుచున్నావు నీ మహిమను పొంది నీ దరిచేరి ఆరాధించెదను --Athi sund
Telugu