అవతరించిన దేవా ఆద్యంతము లేనివాడా
అక్షయుడా పాపుల రక్షకుడ విమోచకుడా /2/
అవతరించిన దేవా ఆద్యంతము లేనివాడా
అక్షయుడా పాపుల రక్షకుడ విమోచకుడా /2/
నమో నమో నమస్తుభ్యం – నమామి మహా ప్రభో
క్రీస్తు దేవా మహా రాజా – విస్తార యశశోభిత
1. వున్నవాడనేవాడ అన్నీ సృజించినవాడా
నన్ను మమ్ములనందరిని – మన్నాతో పోషించేవాడా/2/
మన్నాతో పోషించేవాడా..
నమో నమో నమస్తుభ్యం – నమామి మహా ప్రభో
క్రీస్తు నాధా కృపా సింధు- దేవ పుత్ర విమోచక
2. కాపరివై కాచేవాడ – పాపము తొలగించేవాడ
సైతానును జయించినవాడా – మృతులను బ్రతికించేవాడా /2/
మృతులను బ్రతికించేవాడా..
నమో నమో నమస్తుభ్యం – నమామి మహా ప్రభో
రాజ రాజా మహా తేజ – తేజోమయ పరమాత్మ దేవా
అవతరించ