బలవంతుడా ధనవంతుడా

Telugu Christian Song

బలవంతుడా ధనవంతుడా గుణవంతుడా నా యేసయ్యా నీవంటివాడు లేనేలేడు నీ సాటి ఎవడు రానేరాడు నాకున్న ఆధారం – నాలోని ఆనందం నీవే అ.ప. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా ఏదియు నీవు లేకుండా కలుగలేదుకదా దీవెనలు దయచేయగల మహిమ నీదికదా నాకున్న ఉజ్జీవం – నాలోని ఉత్సాహం నీవే లోపమన్నది నీయందు కానరాదుకదా పాపములు క్షమియించగల మనసు నీదికదా నాకున్న వైభోగం – నాలోని విశ్వాసం నీవే శూరుడా నీముందెవడు నిలువలేడుకదా కార్యములు నెరవేర్చగల ఘనత నీదికదా నాకున్న సౌందర్యం – నాలోని సామర్ధ్యం నీవే --Balavanthuda dhanavanthuda--
Telugu