భజన చేయుచు భక్తపాలక

Telugu Christian Song

భజన చేయుచు భక్తపాలక ప్రస్తుతింతు నీ నామమును (2) వృజినములపై జయము నిచ్చిన (2) విజయుడా నిను వేడుకొందు ||భజన|| దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు (2) భవ్యమైన బోధలెన్నో (2) బాగుగా ధర నేర్పినావు ||భజన|| నరుల గావను పరమునుండి ధరకు నీవు వచ్చినావు (2) పరుడ నైన నా కొరకు నీ (2) ప్రాణము నర్పించినావు ||భజన|| చెడినవాడ నైన నన్ను జేరదీసి ప్రోచినావు (2) పడిన నాడు గోతి నుండి (2) పైకి లేవనెత్తి నావు ||భజన|| ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్య నీకు (2) ఇంతయని వర్ణింప నిలలో (2) నెవనికిని సాధ్యంబు కాదు ||భజన|| --Bhajana cheyuchu bhaktha paalaka--
Telugu