చింత లేదిక యేసు పుట్టెను - వింతగను బెత్లెహేమందున
చెంతజేరను రండి సర్వజనంగమా - సంతస మొందుమా |చింత...
1.దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా
ఖ్యాతి మీరగ వారు యేసుని గాంచిరి - స్తుతు లొనరించిరి |చింత...
2.చుక్కగనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని గనుగొని
చక్కగా బెత్లెహెము పురమున జొచ్చిరి - కానుక లిచ్చిరి |చింత...
3. కన్య గర్భమునందు బుట్టెను - కరుణ గల రక్షకుడు క్రీస్తుడు
ధన్యులగుటకు రండి వేగమే దీనులై - సర్వమాన్యులై |చింత...
4. పాప మెల్లను పరిహరింపను - పరమ రక్షకుడవతరించెను
దాపు జేరిన వారి కీడు గడు భాగ్యము - మోక్షభాగ్యము |చింత...
--Chinthaledika yesu p