చిరకాల స్నేహితుడా

Telugu Christian Song

చిరకాల స్నేహితుడా – నా హృదయాల సన్నిహితుడా నా తోడు నీవయ్యా – నీ స్నేహం చాలయ్య నా నీడ నీవయ్యా – ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం – ఇది నా యేసు స్నేహం బందువులు వెలి వేసిన – వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఆ దివ్య స్నేహం – నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం కష్టాలలో కన్నీలలో – నను మోయు నీ స్నేహం నను దైర్య పరచి అదరణ కలిగించు – నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం నిజమైనది విడువనిది – ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం – నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం --Chirakaala snehithuda naa hrudayana--
Telugu