చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం

Telugu Christian Song

చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం - చిగురించె నాకోసమే నీపై నా ధ్యానం - నాకై నీ త్యాగం - వింతైన సందేశమే 1. కలలుకన్న ప్రేమలన్నీ నిలిచిపోయే మౌనమై నేను నీకు భారమైనదూరమైన వేళలో నీవే నాకు చేరువై చేరదీసినావయా ఎంత ప్రేమ యేసయ్యా 2. గాలిమేడ నీడ చెదరి కృంగిపోయే నామది సంధ్యవేళ వెలుగు మరుగై ఒంటరైన వేళలో దరికి చేరి దారి చూపి ధైర్యపరచినావయా తోడు నీవే యేసయ్యా 3. మధురమైన ప్రేమలోన విలువకలిగె సిలువకు శిలాగానేను నిన్ను చేర నీదురూపు కలిగెను శ్రేష్ఠమైన స్వాస్థ్యమందు నన్ను నిలిపినావయా నిలిపినావు యేసయ్యా --Chirakaala sneham nee prema cheritham chigurinche naakosame--
Hosanna ministries
Telugu