చూచితివే నా కన్నీటిని

Telugu Christian Song

చూచితివే నా కన్నీటిని తుడచితివే నా యేసయ్యా (2) లొంగిపోయిన నా జీవితం కృంగిపోయిన నా ఆత్మను (2) చేరదీసెనే నీ ప్రేమ నన్ను… చేరదీసెనే నీ ప్రేమ ||చూచితివే|| లోకమంతయూ నన్ను ద్వేషించినా సొంత బంధువులంతా నన్ను వెలివేసినా (2) చేరదీసెనే నీ ప్రేమ నన్ను… చేరదీసెనే నీ ప్రేమ ||చూచితివే|| ఒంటరితనం నన్ను వేధించినా దీన దరిద్రురాలై నన్ను అవమానించినా (2) చేరదీసెనే నీ ప్రేమ నన్ను… చేరదీసెనే నీ ప్రేమ ||చూచితివే|| ప్రేమతో నన్ను పిలిచావయ్యా నీ వాక్కునిచ్చి స్వస్థపరచావయ్యా (2) మరువలేనయ్యా నీ ప్రేమ నేను… మరువలేనయ్యా నీ ప్రేమ (3) --Choochithive naa kanneetini--
Telugu