దీనుడా అజేయుడా

Telugu Christian Song

దీనుడా అజేయుడా ఆధరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా జీవదాతవు నీవని శృతిమించి పాడనా జీవదారవు నీవని కానుకనై పూజించనా అక్షయదీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరార్చన చేసెద నీకే నా స్తుతులర్పించెద నీకే సమ్మతిలేని సుడిగుండాలే ఆవరించగా గమనములేని పోరాటాలే తరుముచుండగా నిరుపేదనైన నా యెడల సందేహమేమి లేకుండ హేతువే లేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు సంతోషము నీవే అమృత సంగీతము నీవే స్తుతిమాలిక నీకే వజ్ర సంకల్పము నీవే సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా విరిగి నలిగిన మనస్సుతో హృదయార్చనే చేసెద కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా కర్తవ్యము నీవే కనుల పండుగ
Telugu
12 views