దేవా నా దేవా

Telugu Christian Song

దేవా నా దేవా – నీవే నా కాపరి నీ ప్రేమ నీ క్షమా – ఎంతో గొప్పది (2) ఆరాధింతును హృదయాంతరంగములో స్తుతించెదను నీ పాద సన్నిధిలో (2) నీవే కదా దేవుడవు – (2) దేవా యేసు దేవా (4) ||దేవా|| పాపము నుండి విడిపించినావు పరిశుద్ధుని చేసి ప్రేమించినావు (2) నీవే కదా దేవుడవు – (2) దేవా యేసు దేవా (4) ||దేవా|| పరిశుద్ధాత్మను నాలో నింపావు మట్టి దేహమును మహిమతో నింపావు (2) నీవే కదా దేవుడవు – (2) దేవా యేసు దేవా (4) ||దేవా|| --Deva naa deva--
Telugu