దేవా! నీ కృప నిరంతరం – మారనిదెపుడు

Telugu Christian Song

దేవా! నీ కృప నిరంతరం – మారనిదెపుడు నా ప్రభువా నిత్యజీవము గలది ప్రియ ప్రభువా ….. దేవా! నీ కృప నిరంతరం 1. పాపినగు నన్ను ఓ ప్రభువా – పరిశుద్ధపరచెను నీ కృపయే (2) పరమ స్వాస్థ్యము నొందుటకు – ప్రేమతో నన్ను పిలిచితివే (2) 2. రక్షణ భాగ్యము పొందుటకు – రక్షక యేసు నీ కృపయే (2) నిత్యము నీతో నుండుటకు – నిత్య జీవము నిచ్చితివే (2) 3. విశ్వాస జీవితం చేయుటకు – విజయము నిచ్చెను నీ కృపయే (2) శోధన బాధలు అన్నిటిలో – శక్తినొసంగి నడిపితివే (2) 4. కృపలో నడుపుము ఓ దేవా – కృపతో నింపుము నా ప్రభువా (2) నిత్యము కృపలో నన్ను నడిపి – నిన్నెదుర్కొనుటకు శక్తినిమ్ము (2) --Deva nee krupa nirantharam--
Hosanna ministries
Telugu
1 views