దేవా నీవు నా దేవుడవు నిన్ను వెదకుచున్నాను

Telugu Christian Song

దేవా నీవు నా దేవుడవు నిన్ను వెదకుచున్నాను నా ప్రాణము నీ కొరకు దప్పిక అడుగును (2) నీరులేని ఎండిన భూమిలో నా శరీరము నీ కొరకు ఆశపడును (2) నీ కృప జీవము కంటె మేలు నా పెదవులు నిన్ను స్తుతింతురు (2) నా జీవితకాలమంతయు నిన్ను కొనియాడెదను నీ నామమున నా చేతులు ఎత్తెదను (2) ||దేవా నీవు|| నీ సన్నిధిని పరిశుద్ధలయములో చూచితిని నీ బలమును మహిమను కనెను (2) నా ప్రాణము కొవ్వుతో తృప్తి నొందును నా నోరు ఆనంద గానములతో స్తుతించును (2) ||దేవా నీవు|| నా మంచముపై నిన్ను స్మరించుచున్నాను రాత్రి జాములలో నిన్ను ధ్యానించుచున్నాను (2) నీవు నాకు సహాయము అయితివి నీ రెక్కల నీడన ఆనందించుచున్నాను (2) ||దేవా నీవు||
Traditional
Telugu