దేవాది దేవా ప్రభువుల ప్రభూ

Telugu Christian Song

దేవాది దేవా ప్రభువుల ప్రభూ రాజుల రాజా హల్లెలూయ (2) నీ రక్తముతో విమోచించి నీ రక్తముతో సంపాదించి (2) పరలోక రాజ్య ప్రజలతో జేర్చి (2) పరలోక పాటన్ నా కొసగితివి (2) ||దేవాది దేవా|| జీవిత నావలో తుఫాను రేగ భయపడకుడని అభయము నిచ్చి (2) జయప్రదముగా నన్ను నడిపించి (2) జయజీవితము నా కొసగుచున్న (2) ||దేవాది దేవా|| పేరు పెట్టి నన్ ప్రేమతో పిలచి కరుణతో నీ సొత్తుగా నన్ను జేసి (2) అరమర లేక నన్నాదరించి (2) పరలోక దర్శనంబిచ్చితివి (2) ||దేవాది దేవా|| మరణ పాత్రులం యిద్ధరణిలోన దురిత ఋణముల స్మరణను మాన్పి (2) ఏర్పరచుకొంటివి నేర్పుతో మమ్ము (2) నీ రాజ్యమందు రాజులన్ జేసి (2) ||దేవాది దేవా
Telugu
10 views