దిక్కులేని వాఁడనో ప్రభో నీ యండజేరి మ్రొక్కి సేవఁజేతు నో ప్రభో
మ్రొక్కి విన్నవించు వారి యక్కరలను దీర్చు సత్యము గ్రక్కున నిడి
యాదరించు మక్కువైన దేవ తనయ ||దిక్కులేని||
1. ఘోర పాప భరము నెల్లను మోయుచు నలయు వారలార రండటంచును
భూరి దయను బిలిచి యున్న సార వాక్కు లెఱుఁగ కధిక భార మొంది
తుదిని నీ దరిఁ జేరితి నన్నాదరించుము ||దిక్కులేని||
2. బలము లేని వాఁడనో ప్రభో కేవలము పాప ములను జేసి యలసితిని
ప్రభో ఇలను నే నొనర్చునట్టి కలుష జాలములను నీవు తొలఁగ జేసి
యాత్మ కధిక బలము నొసగి మునుపు మయ్య ||దిక్కులేని||
3. పామరుండ నౌట వల్లను నే నెఱుఁగనైతి క్షేమ మిచ్చు పదవులెల్లను
కామ క్రోధ లోభములను దీమసమున విడిచి యేసు నామ మందు